
ఉపాధినిస్తున్న బతుకమ్మ
పూలకు రంగులద్ది
విక్రయిస్తాను
రాజాపేట : ఆడపడుచులకు బతుకమ్మ అత్యంత ఇష్టమైన పండుగ. వీటిని పేర్చడానికి తంగేడు, గునుగు, ముత్యాలపువ్వు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి, రుద్రాక్ష, గుమ్మడి, టేకు వంటి పూలను ప్రధానంగా వాడుతారు. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కాలంతోపాటు పరుగెడుతున్నారు. ఎవ్వరికీ తీరికలేకపోవడంతో బతుకమ్మకు కావాల్సిన పూలను సేకరించేందుకు సమయాన్ని వెచ్చించడం లేదు. అయితే కొంతమంది మహిళలు మారుతున్న కాలానికి అనుగుణంగా పూలను సేకరించి వాటికి రంగులద్ది మార్కెట్‌లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా బతుకమ్మ పండుగ సీజన్‌లో బంతి, పట్టుకుచ్చుల పూలు, ముత్యాలపువ్వు వంటి పంటలు సేద్యం చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. రాజాపేట మండల కేంద్రానికి చెందిన గొళ్లెన జానమ్మ 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని కొంత భూమిలో వరిసేద్యం చేయడమే కాకుండా అర ఎకరంలో బంతి, అర ఎకరంలో పట్టుకుచ్చుల పూలు సేద్యం చేస్తోంది. రైతుల పొలాల్లో దొరికే ముత్యాల పువ్వు కొనుగోలు చేసి వాటికి రంగులద్ది విక్రయిస్తూ జీవనోపాధి పొందుతోంది. బంతి, పట్టుకుచ్చులు, ముత్యాలపువ్వు రూ. 100కు నాలుగు కట్టల చొప్పున విక్రయిస్తోంది.
ప్రస్తుతం చాలా మందికి బతుకమ్మ కోసం పూలు సేకరించేందుకు బయటకు వెళ్లే తీరిక లేకుండా పోయింది. అందుకే నేను ప్రతి ఏటా బతుకమ్మ పండుగ సందర్భంగా తీరొక్క పూలు సేకరించి వాటికి రంగులద్ది విక్రయిస్తున్నా. రూ. 100కు నాలుగు కట్టల చొప్పున ఇస్తాను. బంతి, పట్టుకుచ్చుల పూల పంట సేద్యం చేశాను.
– జానమ్మ, మహిళా కూలీ, రాజాపేట
ఫ బతుకమ్మ పూల కోసం బంతి,
పట్టుకుచ్చుల పూల సేద్యం
ఫ ముత్యాలపూలకు రంగులద్ది
మార్కెట్‌లో విక్రయిస్తూ ఉపాధి
పొందుతున్న జానమ్మ

ఉపాధినిస్తున్న బతుకమ్మ