
ఉత్తమ పర్యాటక క్షేత్రంగా యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం టూరిజం ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికై నట్లు ఆలయ అధికారులు శుక్రవారం రాత్రి వెల్లడించారు. అవార్డును శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అందజేయనున్నారు. యాదగిరి క్షేత్రానికి అవార్డు రావడం ఆనందంగా ఉందని ఇన్‌చార్జి ఈవో గగులోతు రవినాయక్ పేర్కొన్నారు.
ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. సాయంత్రం సమయంలో అమ్మవారిని బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం ఆలయంలో ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అమ్మవారిని మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవం జరిపించారు. ఇక ఆలయంలో నిత్య పూజలు యధావిధిగా కొనసాగాయి.
యాదాద్రీశుడి సన్నిధిలో
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం దర్శించుకున్నారు. స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ అర్చకులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.

ఉత్తమ పర్యాటక క్షేత్రంగా యాదగిరిగుట్ట

ఉత్తమ పర్యాటక క్షేత్రంగా యాదగిరిగుట్ట