
ఆలేరు ఏటీసీ నేడు ప్రారంభం
ఆలేరు: ఆలేరు పట్టణంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) ఆవరణలో నిర్మించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మల్లేపల్లిలో ఏటీసీల ప్రారంభోత్సానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగా ఆలేరులోని ఏటీసీ కూడా ప్రారంభోత్సవం చేయనున్నారు. రూ.35కోట్ల నిధులతో టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలను నిర్మించింది. గ్రామీణ యువతకు అధునాతన అడ్వాన్స్‌డ్ సాంకేతిక కోర్సుల్లో శిక్షణ అందించి, తద్వారా జాతీయ,అంతర్జాతీయ కంపెనీల్లో ఉపాధి,ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ఏటీసీ లక్ష్యమని శుక్రవారం ఆలేరు ఐటీఐ ప్రిన్సిపాల్ బి.హరికృష్ణ చెప్పారు. ప్రారంభోత్సవానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సివిల్‌సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రారంభోత్సవానికి హాజరుకానున్నట్టు ప్రిన్సిపాల్ హరికృష్ణ తెలిపారు.