
నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
భువనగిరి టౌన్ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ అధికారి పరాంకుశం సాహితి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఇతర కుల సంఘ నాయకులు, అధికారులు, అనధికారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
గోనె సంచులు సవిల్ సప్లై శాఖవే..
మోత్కూరు: ‘తూకం తప్పుతున్న ధర్మకాంట’ శీర్షికతో శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి సివిల్ సప్లై అధికారులు స్పందించారు. మోత్కూరు మండలం అనాజిపురం వేబ్రిడ్జి మోసాలపై గురువారం రైతులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వేబ్రిడ్జి వద్ద పౌరసరఫరాల శాఖకు చెందిన గన్నీ బ్యాంగులు ఉండటాన్ని రైతులు గుర్తించారు. అధికారులు వేబ్రిడ్జిని సందర్శించి గన్నీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. గత సీజన్‌లో వేబ్రిడ్జి వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారని, వారికి చెందినవని అధికారులు తెలిపారు. ఇంకా 440 బస్తాలు రికవరీ కావాల్సి ఉందని సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ తెలిపారు.అలాగే లీగల్ మెట్రోలజీ అధికారులు వచ్చి విచారించేంత వరకు వేబ్రిడ్జిపై తూకాలు వేయ వద్దని నిర్వాహకులను ఆదేశించారు.
29 నుంచి అభ్యంతరాల స్వీకరణ
భువనగిరి: జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్‌లో పొందుపర్చిన మెరిట్ లిస్టుపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 29నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు తెలియజేయాలని ఉపాధి కల్ప నాధికారి సాహితి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో రాతపూర్వకంగా అందజేయాలని కోరారు.
ఇళ్ల నిర్మాణాల పరిశీలన
భువనగిరి, మోటకొండూర్: భువనగిరి మండలం ముస్త్యాలపల్లి, చందుపట్ల మోటకొండూరు మండలం చాడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను శుక్రవారం కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఎలాంటి సమస్యలున్నా అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. బిల్లుల చెల్లింపు వివరాలను హౌసింగ్ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల విధులపై శిక్షణ
భువనగిరిటౌన్ : ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఫలితాల వరకు తీసుకోవాల్సిన జాగ్రజుత్తలు, బాధ్యతలపై చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సూచించారు. మోడల్ కోడ్ పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలన్నారు.

నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

నేడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి