
మూడు మండలాల్లో జోరువాన
ఆత్మకూరు(ఎం): జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. వర్షానికి ఆత్మకూర్(ఎం) మండలంలోని రాయిపల్లిలో బోడ ముత్తయ్య, సుల్తాన్ లక్ష్మి ఇళ్లు దెబ్బతిన్నాయి. పత్తి చేలలోకి నీరు చేరింది. అదే విధంగా బిక్కేరుకు వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగు అవతల ఉన్న మొరిపిరాల గ్రామానికి చెందిన దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి తేలు కరువడంతో చికిత్స నిమిత్తం మండల కేంద్రానికి తీసుకురావాల్సి ఉంది. వాగు దాటనీయకపోవడంతో ట్రాక్టర్ ఇంజన్‌పై వాగులోకి నుంచి ఆస్పత్రికి తరలించారు.
గుండాల : మండలంలోని మాసాన్‌పల్లి, గంగాపురం ఊర చెరువులు అలుగు పోస్తున్నాయి. గుండాల–నూనెగూడెం మధ్య బిక్కేరు వాగు బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. గుండాల పోలీస్ స్టేషన్ ఆవరణలోకి భారీగా వరద నీరు చేరింది.
తుర్కపల్లి : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కురిసిన వర్షానికి కాజ్‌వేల పైనుంచి వరద నీరు ప్రవహించింది.

మూడు మండలాల్లో జోరువాన

మూడు మండలాల్లో జోరువాన

మూడు మండలాల్లో జోరువాన