
పర్యాటకం.. ప్రోత్సహిస్తే మణిహారం
నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం
భువనగిరి: జిల్లాలో ఆధ్యాత్మికత, ఆహ్లాదం పంచే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేస్తామని పాలకులు ఇస్తున్న వాగ్దానాలు కార్యరూపం దాల్చడం లేదు. ప్రధానంగా హైదరాబాద్ –వరంగల్ జాతీయ రహదారి మార్గంలో భువనగిరి నుంచి జనగాం వరకు పర్యాటక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినా నేటికీ అడుగులు పడటం లేదు.
● భువనగిరి ఖిలాను జాతీయ వారసత్వ సంపదగా గుర్తించిన కేంద్రం.. కోటకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సంకల్పించింది. ఖిలా అభివృద్ధితో పాటు రోప్‌వే ఏర్పాటుకు స్వదేశీదర్శన్ 2.0 కింద రూ.118కోట్లు మంజూరు చేసింది. గత సంవత్సరం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో పనులకు శంకుస్థాపన చేశారు. తొలి విడతలో రూ. 56.18 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఇటీవల టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారభించారు. పనులు పూర్తయితే భువనగిరి కోట పర్యాటక ప్రాంతంగా విరాజిల్లనుంది.
● 2వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలేరు మండలంలోని కొలనుపాకలోని జైన దేవాలయాన్ని పట్టించుకునేవారే కరువయ్యారు. ఆలయంలో వర్థమాన మహావీరుడి విగ్రహం ఉంది. తెలంగాణలో జైనమతానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే రాష్ట్రంతో పాటు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది.
ఫ కలగానే భువనగిరి–జనగామ పర్యాటక కారిడార్
ఫ అభివృద్ధికి నోచని కొలనుపాక జైనమందిర్
ఫ కార్యరూపం దాల్చని పాలకుల వాగ్దానాలు
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భువనగిరి ఖిలా వద్ద శనివారం ఉదయం 10.30 గంటలకు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రతిభ గల కళాకారులకు బహుమతులు అందజేయనన్నారు.