
మహాలక్ష్మిగా అమ్మవారు
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపై శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదో రోజు శుక్రవారం మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయం, సాయంత్రం అమ్మవారికి అర్చనలు, పారాయణాలు, శ్రీదేవి మూలమంత్ర జపాలు, శ్రీదేవి చతుషష్టి ఉపచార పూజ, నీరాజన మంత్ర పుష్పములు, లక్ష కుంకుమార్చన, నవావరణ, చతుషష్టి తదితర పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.