
ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
భువనగిరిటౌన్ : తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం ఐలమ్మ జయంత్రి సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, అధికారులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటితరం ఐలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజ చైతన్యానికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పరాంకుశం సాహితి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్‌మోహన్‌ప్రసాద్, కలెక్టరేట్ సిబ్బంది, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు