
తండా నుంచి ఆర్డీఓగా..
మిర్యాలగూడ: దామరచర్ల మండలం పార్థునాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బతండాకు చెందిన తెజావత్ అశోక్‌నాయక్ గ్రూప్–1 ఫలితాల్లో ఆర్డీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. అశోక్‌నాయక్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తిచేసి.. సివిల్స్ లక్ష్యంగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందారు. గ్రూప్–1 రాసి ఆర్డీఓ ఉద్యోగానికి ఎంపికయ్యారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు అన్నివర్గాల ప్రజలకు అందేలా చూస్తానని అశోక్‌నాయక్ తెలిపారు.