
తల్లిదండ్రుల బాటలో..
తిరుమలగిరి(తుంగతుర్తి): గ్రూప్–1 ఫలితాల్లో తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు పత్తి వెంకటాద్రి కుమారుడు పత్తి సందీప్‌కుమార్ డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యారు. సందీప్‌కుమార్ 2020లో ఇంజనీరింగ్ పూర్తిచేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే గ్రూప్–1 రాసి మొదటి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఎంపికయ్యారు. సందీప్ తండ్రి వెంకటాద్రి అడ్డగూడూరులో గెజిటెడ్ హెడ్మాస్టర్‌గా.. తల్లి లలిత వైద్యారోగ్య శాఖలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు.