
కొలువుల ఆనందం
కష్టానికి ఫలితం..
అమ్మానాన్న ప్రోత్సాహంతోనే
సాధ్యమైంది
నల్లగొండ: గ్రూప్–1 తుది ఫలితాల్లో నల్లగొండ పట్టణానికి చెందిన నర్రా శేఖర్‌రెడ్డి, కరుణ దంపతుల కుమార్తె నర్రా శ్రీజారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా ఉద్యోగం సాధించింది. ఇప్పటికే ఆమె గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికై సంగారెడ్డి మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. అంతేకాకుండా గ్రూప్–3 ఫలితాల్లో కూడా 111వ ర్యాంకు సాధించింది. గ్రూప్–2 ఫలితాలు వెలువడాల్సి ఉంది. శ్రీజారెడ్డి తండ్రి శేఖర్‌రెడ్డి ఎస్‌జీటీ టీచర్‌గా నార్కట్‌పల్లి మండలం ఏనుగులదొరి గ్రామంలో పనిచేస్తున్నారు. వారి స్వస్థలం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామం. శ్రీజారెడ్డి డిగ్రీ పూర్తిచేసి ఇంట్లోనే ఉండి సొంతంగా పోటీ పరీక్షలకు సిద్ధమైంది. శ్రీజారెడ్డి గ్రూప్–1 ఉద్యోగం సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు శేఖర్‌రెడ్డి, కరుణ ఆనందం వ్యక్తం చేశారు. మొదట నుంచి శ్రీజారెడ్డి చదువులో చురుకుగా ఉండేదని, ఆమె ఇష్టం ప్రకారమే డిగ్రీ చదివించామని వారు పేర్కొన్నారు.
చదువు విషయంలో మా అమ్మానాన్న ఎప్పుడు నాపై ఒత్తిడి చేయలేదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చదివినా.. చదివిస్తామని చెప్పి నన్ను ప్రోత్సహించారు. 2020లో డిగ్రీ పూర్తయినప్పటి నుంచి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. సివిల్స్‌కు కూడా రాశాను. ఆ అనుభవమే గ్రూప్–1 మెయిన్స్‌కు ఉపయోగపడింది. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించాను. – శ్రీజారెడ్డి
వారందరూ అనుకున్న లక్ష్యాన్ని
చేరుకునేందుకు పట్టుదలతో అహర్నిషలు
కష్టపడి చదివారు. క్రమశిక్షణతో చదువుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ టీజీపీఎస్పీ ప్రకటించిన గ్రూప్–1 తుది ఫలితాల్లో ఉన్నత స్థాయి
ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లాలో గ్రూప్–1 ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులపై ప్రత్యేక కథనాలు..