
సాగర్‌కు తగ్గుముఖం పట్టిన వరద
నాగార్జునసాగర్: సాగర్‌కు ఎగువ నుంచి వస్తున్న వరద కొంత మేర తగ్గింది. గత రెండు రోజులు 3లక్షల క్యూసెక్కులకు పైగా వరద రాగా.. గురువారం 2,93,744 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో 26 క్రస్ట్ గేట్ల ద్వారా 2,28,330 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో 33,130, కుడి కాల్వ, ఏఎమ్మార్పీ వరద కాల్వల ద్వారా 11,719 క్యూసెక్కులు కలిపి 2,73,169 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ గరిష్ట స్థాయి నీటిమట్టం 590(312 టీఎంసీలు) అడుగులు కాగా ప్రస్తుతం 586.70(303 టీఎంసీలు) అడుగుల మేర నీటి మట్టం ఉంది.
ఎడమ కాల్వకు నీటి నిలిపివేత
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సాగర్ ఎడమ కాల్వ కు అధికారులు గురువారం నీటి విడుదలను నిలిపివేశారు. ఉదయం నుంచే నీటిని తగ్గిస్తూ.. మధ్యాహ్నం 2గంటలకు పూర్తిగా నీటిని నిలిపివేశారు.
ఫ ఎగువ నుంచి 2,93,744
క్యూసెక్కుల వరద
ఫ 26 గేట్ల ద్వారా నీటి విడుదల