
ఉత్పత్తి ధరలకే చేనేత వస్త్రాల విక్రయం
చౌటుప్పల్ రూరల్: చేనేత వస్త్రాలను ఉత్పత్తి ధరకు విక్రయించడం అభినందనీయమని చేనేత జౌళి శాఖ ఏడీ అన్నదేవర శ్రీనివాసరావు అన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం పరిధిలోని టెక్స్‌టైల్ పార్క్‌లో సాధారణ వస్త్రాల విక్రయ కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం 50 ఎకరాల్లో టెక్క్‌టైల్ పార్కు ఏర్పాటు చేసిందన్నారు. పార్క్‌లో ఇంకా ఉత్పత్తి పెంచేలా యజమానులతో మాట్లాడుతామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, టీజీఐఐసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ భవాని, టిప్ ప్రధాన కార్యదర్శి ఎం,గోపాలరావు, టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధి అధ్యక్షుడు విజయ్‌కుమార్, ఐలా సర్వీస్ చైర్మన్ ఎంకేడి ప్రసాద్,నిర్వహకులు కే.కృష్ణమూర్తి,వేణు,రీజీమా,చిట్టిబాబు,శ్రవణ్‌కుమార్,శ్రీనివాస్ పాల్గోన్నారు.
పర్సన్ ఇంచార్జి చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
చౌటుప్పల్ : చౌటుప్పల్ పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి చైర్మన్‌గా చింతల దామోదర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్‌గా ఉన్న దామోదర్‌రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో రామన్నపేట అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.సురేష్‌ను పర్సన్ ఇంచార్జిగా ఈనెల 10వ తేదీన నియమించారు. తనను తప్పించడాన్ని సవాల్ చేస్తూ దామోదర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. 28413/ 2025 ప్రకారం ఆయనను మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్యను మినహాయించి మిగతావారిని పర్సన్ ఇంచార్జి డైరెక్టర్లుగా అనుమతిస్తూ ఆదేశించింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఈఓ రమేష్, సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు. వచ్చే నెల 7న సర్వసభ్య సమావేశం నిర్వహించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. చైర్మన్‌ను సభ్యులు సత్కరించారు.
రోగనిరోధక టీకాలపై అవగాహన
బీబీనగర్: స్వస్థ్‌నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ భాగంగా గురువారం బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రోగనిరోధ టీకాలపై రోగులకు అవగాహన కల్పించారు. టీకాలు ప్రాణాలు ఎలా కాపాడుతాయో నాటక ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ అభిషేక్ ఆరోరా, వైద్యులు నీరజ్ అగర్వాల్, సయ్యద్ అహ్మద్ జాకి, జ్యోతి, రుచిశుక్లా తదితరులు పాల్గొన్నారు.

ఉత్పత్తి ధరలకే చేనేత వస్త్రాల విక్రయం

ఉత్పత్తి ధరలకే చేనేత వస్త్రాల విక్రయం