బతుకమ్మకు గుర్తింపు తెచ్చింది కేసీఆరే | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మకు గుర్తింపు తెచ్చింది కేసీఆరే

Sep 26 2025 5:58 AM | Updated on Sep 26 2025 5:58 AM

బతుకమ్మకు గుర్తింపు తెచ్చింది కేసీఆరే

బతుకమ్మకు గుర్తింపు తెచ్చింది కేసీఆరే

యాదగిరిగుట్ట: ఉమ్మడి రాష్ట్రంలో మరుగునపడిన బతుకమ్మకు కేసీఆర్‌ గుర్తింపు తీసుకువచ్చారని, అధికారిక పండుగా ప్రకటించారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్టలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాల్సిన మహిళలు యూరియా కోసం పీఏసీఎస్‌ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామిని మాజీ మంత్రి హరీష్‌రావు వేడుకున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి మోసపూరిత వాగ్ధానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో ఏనాడూ యూరియా కొరత రాలేదన్నారు. డీసీసీబీ మాజీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ యాదగిరి కొండపైకి వెళ్లే ఆటో కార్మికులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మోసం చేశారని, కొండపైకి భక్తులను తీసుకెళ్లాలంటే రుసుము చెల్లించాల్సి వస్తుందన్నారు. రూ.32 లక్షలు దేవస్థానానికి చెల్లించాలని ఇటీవల ఆటో కా ర్మికులకు నోటీసులు ఇచ్చారని, ఎందుకు చెల్లించాలో ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మదర్‌ డెయిరీ మాజీ చైర్మన్‌ లింగాల శ్రీకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇమ్మడి రాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, నాయకులు బీమగాని నర్సింహగౌడ్‌, ఎగ్గిడి కృష్ణ, వంటేరు సురేష్‌రెడ్డి, వస్పరి శంకరయ్య, కసావు శ్రీనివాస్‌గౌడ్‌, బీర్ల మహేష్‌, వెంకటేష్‌గౌడ్‌, తోటకూరి బీరయ్య, కాల్నె అయిలయ్య, కొర్రె భిక్షపతి, సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వం వల్లే యూరియా కష్టాలు

ఫ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, కంచర్ల

రామకృష్ణారెడ్డి, మహేందర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement