
చికిత్స పొందుతూ మృతి
అర్వపల్లి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహడ్ గ్రామానికి చెందిన ఉప్పుల అనిల్‌కుమార్(34) గత నెల 3న బైక్‌పై తన పొలం నుంచి ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఈట సైదులు తెలిపారు.
పల్లె ప్రకృతి వనం బోర్డు చోరీ
మిర్యాలగూడ: దామరచర్ల మండలం రాజగట్టు గ్రామం పల్లె ప్రకృతి వనం మెయిన్ గేట్‌కు ఉన్న బోర్డును గుర్తుతెలియని వ్యక్తులు కట్ చేసి దొంగిలించారు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. గత 20 నెలలుగా గ్రామ కార్యదర్శి, అధికారులు పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు. వెంటనే అధికారులు స్పందించి బోర్డు దొంగిలించిన వ్యక్తులను అరెస్ట్ చేసి పల్లె ప్రకృతి వనం అభివృద్ధికి కృషిచేయాలని కోరారు.
ఎంజీయూ వాలీబాల్ పోటీల
విజేత ఎంఎంఆర్ కళాశాల
నల్లగొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు యూనివర్సిటీలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఎంఎంఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థులు విజేతగా నిలిచారు. భువనగిరిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రన్నరప్‌గా నిలిచారు. గెలుపొందిన క్రీడాకారులకు బుధవారం ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డా. హరీష్‌కుమార్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డీఓ అక్బల్ అలీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు మురళి, శ్రీనివాసరెడ్డి, పలు కళాశాలల పీడీలు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ మృతి