
నాలాల చుట్టూ. ఆక్రమణల గుట్టు
8 కి.మీపొడువ నాలా
పరిశీలిస్తున్నాం
రైల్వే శాఖకు లేఖలు రాశాం
ఆలేరు: పట్టణంలో ప్రధాన నా లాల ఆక్రమణల గుర్తింపునకు రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సంయుక్త సర్వే చేయడానికి సిద్ధమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు ఇష్టానుసానురంగా వెంచర్లు చేయడం, మరికొందరు నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టం వల్ల ఆక్రమణలు జరిగినట్టు అధికా రుల దృష్టికి వచ్చింది. తద్వారా నాలాలు ఇరుకుగా మారి, వరద ప్రవాహానికి అడ్డంకిగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆలేరు పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులు, వస్తువులు, దుస్తులు తడవడంతో పాటు రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. ఏటా వానాకాలం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ముంపు కాలనీల సమస్యలపై ‘ఏటా ముంపు..ఏదీ కనువిప్పు’ శీర్షికతో ఈనెల 15వ తేదీన ‘సాక్షి’ దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈమేరకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఆక్రమణలను గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. రెవెన్యూ రికార్డుల్లో నాలాల వైశాల్యం, నాలాల బఫర్‌జోన్ నిబంధనలను పరిశీలిస్తున్నారు. నాలాల సమీపంలో నిబంధనల ప్రకారమే కట్టడాలు చేశారా? ఈ మేరకు ఆక్రమణలు జరిగాయనే అంశాలపై సర్వే చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సమస్య ఇదీ..
పాత మున్సిపల్ కార్యాలయం, బ్రహ్మంగారి గుడి, కొలనుపాక రోడ్డు, రైల్వేట్రాక్, ఆలేరు ప్రధాన రోడ్డు పక్కన వరద సాఫీగా ముందుకు వెళ్లడంలేదు. ఫలితంగా 11,12 వార్డుల పరిధిలో రంగనాయకుల వీధి, కుమ్మరివాడ, బొడ్రాయి తదితర కాలనీలు ముంప బారిన పడటం తెలిసిందే.
బైరవకుంట, పర్రేకాల్వ నుంచి శ్రీరామకృష్ణ విద్యాలయం వరకు సుమారు 8 కిలో మీటర్ల పొడవు ప్రధాన నాలాలు ఐదు వరకు ఉన్నాయి. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఆయా కుంటలు పొంగితే వరదనీరంతా ఆయా నాలాల మీదుగా బైపాస్ సమీపంలోని పెద్దవాగులో కలవాలి.
గుర్తింపునకు రంగం సిద్ధం
ఫ సర్వే చేయడానికి రెవెన్యూ,
మున్సిపల్ శాఖల సన్నాహాలు
ఫ ఆక్రమణదారులకు
త్వరలో నోటీసులు జారీ
ఫ రైల్వేట్రాక్ కింద పూడుకుపోయిన
నాలా విషయమై ఆ శాఖ
ఉన్నతాధికారులకూ లేఖలు
రెవెన్యూ రికార్డుల్లో నాలాల వివరాలను పరిశీలన చేస్తున్నాం. అనంతరం ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి వివరణ కోరుతాం. అన్ని అంశాల పరిశీలన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
– ఆంజనేయులు, తహసీల్దార్, ఆలేరు
రెవెన్యూ శాఖతో కలిసి నాలాల ఆక్రమణల గుర్తింపునకు సర్వే చేయనున్నాం. ఆలేరు ప్రధాన రోడ్డు పక్కన ఉన్న రైల్వే ట్రాక్ కింద కల్వర్టు వద్ద వరద నీరు వెళ్లడం లేదు. మరమ్మతుల కోసం రైల్వే ఉన్నతాధికారులకు లేఖలు రాశాం. వారి నుంచి క్లియరెన్స్ రాగానే పనులు మొదలవుతాయి. రైల్వే అధికారులతో కలెక్టర్ కూడా సంప్రదింపులు చేస్తున్నారు.
– శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, ఆలేరు

నాలాల చుట్టూ. ఆక్రమణల గుట్టు

నాలాల చుట్టూ. ఆక్రమణల గుట్టు

నాలాల చుట్టూ. ఆక్రమణల గుట్టు