
వండి వార్చింది.. ఒక్క రోజే
లబ్ధిదారులు ఇలా..
స్పష్టమైన అదేశాలు రాలేదు
భువనగిరిటౌన్ : అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎగ్ బిర్యానీ పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మరింత పుష్టికరమైన ఆహారం అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం ఒక్క రోజుతోనే నిలిచిపోయింది. జూన్ 11న పలు కేంద్రాల్లో అట్టహాసంగా ప్రారంభించినా ఆ తరువాత అమలుకు నోచడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులకు ఇప్పటికే ఆరోగ్యలక్ష్మి పేరుతో ప్రభుత్వం పౌష్టికాహారం అందజేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి రోజూ అన్నం, గుడ్డు, పాలతో పాటు పప్పు, వివిధ రకాల కూరగాయలు, సాంబారుతో వండి పెడుతున్నారు. అదనంగా మురుకులు, బాలమృతం కూడా అందజేస్తున్నారు. దీంతో పాటు వారానికి రెండు సార్లు ఎగ్ బిర్యానీ పెట్టాలని ప్రభుత్వం జూన్ మొదటివారంలో నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జూన్ 11వ తేదీన పథకాన్ని ప్రారంభించారు. మొదటి రోజు సంక్షేమ శాఖ అధికారులు సైతం పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా ఎగ్ బిర్యానీ వడ్డించారు. కాగా మొదటి రోజు సొంత ఖర్చులతో వండిపెట్టిన అంగన్‌వాడీ కార్యకర్తలు ఆ తరువాత చేతులెత్తేశారు. దీంతో ఈ పథకం ఒక్క రోజుకే పరిమితమైంది.
కారణాలివీ..
ఎగ్ బిర్యానీ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వం.. కొనసాగించేందుకు సరైన కార్యాచరణ రూపొందించలేదు. దీనికి తోడు నిధులు కేటాయించకపోవడం, చేతినుంచి ఖర్చు చేయాల్సి వస్తుండటంతో అంగన్‌వాడీ టీచర్లు ఆర్థికభారంగా భావించారు. పైగా మెనూలో ఎగ్ బిర్యానీ చేర్చలేదని, ప్రారంభం రోజు తామే సొంత ఖర్చులతో వంటకాలు వండి పెట్టామని, తదపరి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు.
అంగన్‌వాడీల్లో ఆదిలోనేనిలిచిన ఎగ్ బిర్యానీ స్కీం
ఫ ప్రారంభం అదిరినా అమలు శూన్యం
ఫ ప్రభుత్వం నిధులు కేటాయించలేదంటున్న టీచర్లు
జిల్లాలో భువనగిరి, ఆలేరు, మోత్కూరు, రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 901 అంగన్‌వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. బాలింతలు 3,680, గర్భిణులు 4,219, చిన్నపిల్లలు 12,420 మంది ఉన్నారు. వీరందరికీ ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా ప్రతి రోజూ పోషకాహారం అందిస్తున్నారు.
ఎగ్ బిర్యానీ పథకాన్ని ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు జూన్ 11న ప్రారంభించాం. మొదటి రోజూ సొంత ఖర్చులతోనే వంటకాలు చేయడం జరిగింది. ఇంకా మెనూలో చేర్చలేదు. పథకం కొనసాగింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టౖమైన ఆదేశాలు రాలేదు.
–నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి