
అన్నపూర్ణగా దుర్గాదేవి
యాదగిరిగుట్ట రూరల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం యాదగిరి కొండపై ప్రతిష్ఠించిన దుర్గామాత అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజ, అర్చనలు, పారాయణములు, శ్రీదేవి మూలమంత్రములు, జపములు, సహస్రనామార్చన, మధ్నాహా పూజ నిర్వహించారు. సాయంత్రం నవావరణ పూజ, సహస్రనామార్చనలు, మంత్ర పుష్పం తదితర వేడుకలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు