
చెరువులు, కుంటలను సర్వే చేయండి
సాక్షి,యాదాద్రి: హెచ్‌ఎండీ పరిధిలో ఉన్న చెరువులను సర్వే చేసి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలను గుర్తించాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. బుధవారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. హెచ్‌ఎండీఏ మండలాల పరిధిలో ఉన్న చెరువులు, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ తదితర వివరాలపై సమీక్షించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో కొన్ని చెరువులు నిండి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో వివిధ కట్టడాలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసిందన్నారు. అటువంటి వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలి ఆదేశించారు. అంతేకాకుండా కుంటలను సైతం ఆక్రమించి లే అవుట్‌లు చేస్తున్నారని, వాటిని కూడా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
నూతన గోదాముల నిర్మాణం
భవిష్యత్ అవసరాల దృష్ట్యా నూతన గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి అధికారుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఉన్న గోదాములు ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదన్నారు. గ్రీన్ స్టోరేజ్ స్కీం ద్వారా సహకార సంఘాల కోసం 40వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్లు నిర్మించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. రైలు, రోడ్డు మార్గాలకు దగ్గరగా నాబా ర్డు ఆర్థిక సహాయంతో నిర్మాణం చేస్తామన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు