
60 దాటినా ఆరి్థక భరోసా..
అర్హులందరికీ అవకాశం
రామన్నపేట: స్వయం సహాయక మహిళా సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీ) సభ్యుల వయసును 60 ఏళ్లకే పరిమితం చేయడంతో ఆ వయసు దాటిన వారు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను గుర్తించిన సర్కార్.. ఇందిరా మహిళాశక్తి మిషన్–2025లో భాగంగా వృద్ధ మహిళలతోనూ సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 5,309 మంది వృద్ధ మహిళలను గుర్తించారు. వారితో సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంకులో ఖాతాలు తెరిపించారు.
సామాజిక మద్దతు
కుటుంబాల్లో వృద్ధులు రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. సంపాదించే శక్తి సన్నగిల్లి ఆర్థిక భద్రత లేకపోవడం, అనారోగ్యం, మానసిక, శారీరక నియంత్రణ శక్తి లేకపోవడం, న్యూనతా భావం పెరగడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలను అధిగమించి సామాజిక మద్దతు కల్పించేందుకు 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలతో సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సంఘాల్లో కొనసాగుతున్న వారిని వయసు నిండిన వెంటనే గ్రూప్‌ల నుంచి తొలగించకుండా వృద్ధుల సంఘాల్లోకి మారుస్తారు.
ఒక్కో గ్రూప్‌లో 10నుంచి 15 మంది సభ్యులు
ఒక్కో సంఘంలో 10 నుంచి 15 మంది సభ్యులుగా ఉంటారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఐదుగురు ఆపై సభ్యులతో కూడా గ్రూప్‌గా ఏర్పడవచ్చు. తమ దైనందిన చర్యలను చేసుకోగలిగే వారు, కొంత వరకు ఇతరుల సహాయం పొందేవారు సభ్యులుగా చేరవచ్చు. సంఘం ఏర్పాటైన తరువాత గ్రూప్ పేరుమీదు ఎస్‌బీ ఖాతా తెరిచి తమ ఆదాయం మేరకు పొదుపును నిర్ణయించి నెలనెలా బ్యాంకులో జమచేయాలి. సంఘాల పనితీరు ఆధారంగా ప్రభుత్వం గ్రేడింగ్ చేసి ఆర్‌ఎఫ్, వీఆర్‌ఎఫ్ నిధులను సంఘాలకు అందజేస్తుంది.
సభ్యులకు అవగాహన
జిల్లాలో 60 ఏళ్లు దాటిన వృద్ధ మహిళలతో 1,482 సంఘాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు 5,309 మంది వృద్ధ మహిళలను గుర్తించి వారితో 218 సంఘాలు ఏర్పాటు చేశారు. సంఘాల పేరున బ్యాంకులో ఖాతాలు తెరిచారు. వారి వివరాలను ప్రత్యేక యాప్‌లోనూ నమోదు చేశారు.
వృద్ధ మహిళలు ద్ధార్థిక సమస్యలను అధిగమించడానికి స్వయం సహాయక సంఘాలు దోహదపడతాయి. వృద్ధ మహిళలతో సంఘాల ఏర్పాటు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 218 సంఘాలు ఏర్పాటు చేశాం. ఇంకా 1,264 సంఘాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. అర్హత కలిగిన వృద్ధ మహిళలందరికీ సంఘాల్లో అవకాశం కల్పిస్తాం. ఎవరైనా ఉంటే ముందుకు రావాలి.
–నాగిరెడ్డి డీఆర్‌డీఓ
ఫ ఎస్‌హెచ్‌జీల్లో వృద్ధ మహిళలకూ అవకాశం
ఫ జిల్లాలో 5,309 మంది గుర్తింపు
ఫ 218 సంఘాలు ఏర్పాటు