
తుది ఓటరు జాబితా విడుదల
ఫ ‘స్థానిక’ ఓటర్లు 5,32,240, పోలింగ్ కేంద్రాలు 1,001
ఫ జెడ్పీ, మండల పరిషత్ కార్యాలయాల్లో జాబితాల ప్రదర్శన
సాక్షి, యాదాద్రి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించారు. జిల్లాలో 17 జెడ్పీటీసీ, 178 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,001 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఆరు పోలింగ్ కేంద్రాలు పెరిగినట్లు జెడ్పీ సీఈఓ శోభారాణి తెలిపారు. అదే విధంగా 5,32,240 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాలను జిల్లా పరిషత్, మండల పరిషత్ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై ప్రదర్శించారు.
మండలం ఎంపీటీసీలు పోలింగ్ ఓటర్లు
కేంద్రాలు
అడ్డగూడూరు 07 44 23,022
ఆలేరు 07 40 21,537
ఆత్మకూర్(ఎం) 08 49 25,533
పోచంపల్లి 10 54 27,497
భువనగిరి 13 75 39,654
బీబీనగర్ 14 79 42,876
బొమ్మలరామారం 11 63 29,503
చౌటుప్పల్ 12 67 38,501
గుండాల 09 48 26,069
మోటకొండూరు 07 39 21,103
మోత్కూర్ 05 27 13,215
నారాయణపూరం 13 73 40,113
రాజాపేట 11 57 30,236
రామన్నపేట 15 83 45,358
తుర్కపల్లి 10 55 27,977
వలిగొండ 17 96 52,431
యాదగిరిగుట్ట 9 52 27,615
మొత్తం 17 1,001 5,32,240