
నేడు వినోబాభావే జయంతి వేడుకలు
భూదాన్‌పోచంపల్లి: భూదానోద్యమ పితామహుడు ఆచార్య వినోబాభావే 130వ జయంతి వేడుకలను గురువారం భూదాన్‌పోచంపల్లిలో నిర్వహించనున్నట్లు వినోబాభావే సేవా సంఘం నాయకులు ఏలే భిక్షపతి, కొయ్యడ నర్సింహ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ప్రఽథమ భూదాత కుటుంబసభ్యులు, వినోభానగర్ డెవలప్‌మెంట్ సొసైటీ అధ్యక్షుడు గున్నా రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు తడక వెంకటేశ్వర్లు, కల్పన ఫౌండేషన్ అవార్డు గ్రహీత, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
17నుంచి ‘సేవాపక్షం’
భువనగిరి: ప్రధానమంత్రి నరేంద్రమోది పుట్టిన రోజును పురస్కరించుకొని బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవాపక్షం కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్ తెలిపారు.బుధవారం భువనగిరిలోని పార్టీ కార్యా లయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.సేవాపక్షంలో భాగంగా స్వచ్ఛభారత్, రక్తదాన శిబిరాలు, ఆత్మనిర్భర్ భారత్, పేదలకు, దివ్యాంగులకు సహకరంచడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సేవాపక్షం జిల్లా కన్వీనర్ పడమటి జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కో కన్వీనర్ మాధురి, జంగా రెడ్డి, కత్తుల శంకర్, భూక్య నరేష్ నాయక్, మాజీ అధ్యక్షుడు పాశం భాష్కర్, శ్యాంసుందర్‌రెడ్డి, గూడూరు నరోత్తంరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, యాదిరెడ్డి, అచ్చయ్య, కృష్ణ, మల్లారెడ్డి, సోమనర్సయ్య, నర్సింహ్మరావు, సీనియర్ నాయకులు దాసరి మల్లేశం, లింగస్వామి,విజయభాస్కర్‌రెడ్డి, సుర్వి శ్రీనివాస్, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలో కార్డన్ సెర్చ్
యాదగిరిగుట్ట: సేఫ్ యాదగిరిగుట్ట పేరుతో బుధవారం రాత్రి యాదగిరిగుట్ట పట్టణంలో ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గణేష్ నగర్, ప్రశాంత్‌నగర్ నివాస గృహాలు, లాడ్జీల్లో తనిఖీలు చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 29 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, ఒక కారు సీజ్ చేశారు. రూ.18 వేల విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. ముగ్గురు పాత నేరస్తులు, లాడ్జీల్లో 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీననివాస్‌నాయుడు మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట క్షేత్ర భద్రత, శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా సీపీ సుఽధీర్‌బాబు, డీసీపీ అకాంశ్‌యాదవ్ ఆదేశాల మేరకు కార్డన్‌సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తులు సంచరించినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్డన్ సెర్చ్‌లో ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 120 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

నేడు వినోబాభావే జయంతి వేడుకలు