
సాగర్‌కు కొనసాగుతున్న వరద
నాగార్జునసాగర్: సాగర్ వద్ద 14రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. శ్రీశైలం జలా శయం నుంచి 1,67,448 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా అంతే నీటిని సాగర్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. 14క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదనతో దిగువ కృష్ణానదిలోకి 1,45, 882 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కుడి,ఎడమ, వరద, ఏఎమ్మార్పీ కాల్వలలకు 21,166 క్యూసెక్కుల నీరువిడుదల అవుతుంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 590.00అడుగులు, 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 589.20 అడుగులు, 309.6546 టీఎంసీలుగా నమోదైంది.