
మరో నెలలో మ్యాపింగ్ పూర్తి
జిల్లాలో 432కి.మీ.11కేవీ, 59 కి.మీ. పొడవు 33/11కేవీ ఫీడర్లు ఉన్నాయి. మొత్తం 97 సబ్‌స్టేషన్‌లు ఉన్నాయి. వీటి పరిధిలోని ఎన్ని స్తంభాలు వాటి కేటగిరి తదితర నెట్‌వర్క్ వివరాలు ఏయిమ్స్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. మరో నెలలో జీఐఎస్ మ్యాపింగ్ ప్రక్రియ ముగియనుంది. ఈ మొబైల్ యాప్ ద్వారా నిర్వహణ లోపాల గుర్తింపు, సత్వర పరిష్కారం, వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ పంపిణీ సేవలు అందనున్నాయి. లైన్‌మెన్ల నుంచి ఏఈ, ఏడీఏ, డీఈ, ఎస్‌ఈల వరకు ఎవరి పరిధిలో వారికి యాప్ ద్వారా బ్రేక్‌డౌన్ తదితర సమస్యల సమాచారం వెంటనే తెలుస్తుంది.
– సుధీర్‌కుమార్, ఎస్‌ఈ యాదాద్రి జిల్లా