
సాంకేతికతకు శ్రీకారం
మాన్యువల్‌కు స్వస్తి..
ఆలేరు: ప్రకృత్తి వైపరీత్యాలు సంభవించి విద్యుత్ స్తంభాలు నేలకొరిగిప్పుడు, ఈదురు గాలులకు తీగలు తెగినప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. ఎవరో ఒకరు విద్యుత్ అధికారులు, సిబ్బందికి చెబితే తప్ప సమస్య వారికి తెలిసేది కాదు. విద్యుత్ సరఫరా లోపాన్ని గుర్తించేందుకు పోల్ నుంచి పోల్‌ను పరిశీలిస్తే కానీ సమస్య సిబ్బందికి తెలిసేది. దీనిని గుర్తించడానికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉండేది కాదు. దీంతో లోపాన్ని గుర్తించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బందికి చాలా సమయం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(లి)టీజీఎస్‌పీడీసీఎల్ మాన్యువల్ పద్ధతికి స్వస్తి పలికి సాంకేతిక విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఏయిమ్స్ మొబైల్ యాప్
భవిష్యత్‌లో ఈ తరహా కరెంట్ కష్టాల సత్వర పరిష్కారానికి డిస్కమ్ ‘ఏయిమ్స్’ (అసెట్ ఇన్‌స్పెక్షన్ మెయింటెన్స్ సిస్టం)మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే క్షేత్రస్థాయిలో లైన్‌మెన్ నుంచి ఎస్‌ఈ వరకు ఈ యాప్ ద్వారా సమాచారం వెళ్లి, వారిని అప్రమత్తం చేస్తుంది. తద్వారా క్షేత్రస్థాయిలో లైన్ల వారీగా డిఫాల్ట్ లోకేషన్ వివరాలు అధికారులు, సిబ్బంది అరచేతిలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో సిబ్బంది సులువుగా డిఫాల్ట్ లొకేషన్‌కు చేరుకొని, సాధ్యమైనంత తొందరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈక్రమంలో గతంలో మాదిరిగా విద్యుత్ నిర్వహణ లోపాలను గుర్తించి సరఫరా పునరుద్ధరణలో జరిగే జాప్యానికి చెక్ పడుతుంది.
జీఐఎస్ మ్యాపింగ్
యాదాద్రి జిల్లాలోని 11కేవీ, 33కేవీ ఫీడర్లతోపాటు సబ్‌స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, అండర్‌గ్రౌండ్ కేబుల్, ఏబీ స్విచ్‌లు, కండక్టర్లు, డీటీఆర్‌లు తదితర నెట్‌వర్క్ భాగాల పూర్తి వివరాలను నిల్వ చేయడానికి భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) సాంకేతికను ఉపయోగిస్తున్నారు. ఈమేరకు జిల్లా వ్యాప్తంగా అధికారులు, సిబ్బంది రెండు నెలలుగా ఈ వివరాలను సేకరిస్తూ జీఐఎస్‌లో నిక్షిప్తం చేస్తూ మ్యాపింగ్ ప్రక్రియ చేస్తున్నారు.
డేటా మొత్తం డిజిటలైజేషన్
యాప్ ద్వారా డిస్కం నెట్‌వర్క్ వివరాలన్నీ డిజిటలైజేషన్ చేస్తుంది. సబ్‌స్టేషన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడ ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. తీగలు తెగటం, డిస్క్, ఇన్సులేటర్, ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్ తదితర బ్రేక్‌డౌన్స్ సమాచారం వెంటనే తెలుస్తోంది. లొకేషన్‌కు సిబ్బంది తొందరగా చేరుకునే వీలు కలుగుతుంది. తక్కువ సమయంలో సరఫరా పునరుద్ధరణకు వెసులుబాటు కలగనుంది. ఇలా సబ్‌స్టేషన్ పరిధిలోని చివరి పోల్ వరకు రోడ్డు క్రాసింగ్ వద్ద అండర్‌గ్రౌండ్ కేబుల్‌తో సహా సమస్యను జీఐఎస్ మ్యాపింగ్‌తో గుర్తించి పరిష్కరిస్తారు.
కరెంట్ కష్టాల సత్వర పరిష్కారానికి ‘ఏయిమ్స్’ యాప్ రూపొందించిన టీజీఎస్‌పీడీసీఎల్
దీని సాయంతో లైన్‌మెన్ నుంచి ఎస్‌ఈ వరకు సమాచారం
విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యానికి చెక్
కొనసాగుతున్న నెట్‌వర్క్
మ్యాపింగ్ ప్రక్రియ