
జిట్టా బాలకృష్ణారెడ్డికి నివాళి
భువనగిరి : పట్టణ కేంద్రం తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకు ముందు స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అనంతరం రైతు బజార్ ఎదుట అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యకరమంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్, కుటుంబ సభ్యులు సునిత, వివేకానంద, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ కో ఆర్డినేటర్ కోల్పుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు అంజనేయులు, వెంకటేశ్వర్లు, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్, నాయకులు రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, జనగాం పాండు, ర్యాకల శ్రీనివాస్, నువ్వుల సత్యనారాయణ, గోమారి సుధాకర్‌రెడ్డి, చిలుగూరి సత్తిరెడ్డి, రత్నపురం శ్రీనివాస్, నవీన్, మదు తదితరులు పాల్గొన్నారు.
జిట్టా పోరాటం మరువలేనిది
బీబీనగర్ : తెలంగాణ రాష్ట్ర సాధనలో దివంగత జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన పోరాటం మరువలేనిదని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి కొనియాడారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని జిట్టా విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిట్టా సునిత , నాయకులు పింగళ్‌రెడ్డి, శ్యామ్‌గౌడ్, లక్ష్మినారాయణ, నరేంధర్‌రెడ్డి, బాలకృష్ణ, సుదర్శన్‌రెడ్డి, అశోక్, శ్రీనివాస్, శంకర్ పాల్గొన్నారు.