
గంజాయి విక్రేతల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్: గంజాయి సేవించడంతోపాటు, చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి స్థానిక యువకులకు విక్రయిస్తున్న ఐదుగురిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం డీఎస్పీ రాజశేఖర రాజు నిందితుల వివరాలు వెల్లడించారు. రైస్‌మిల్లులో పని చేసేందుకు బిహార్ రాష్ట్రం నుంచి సౌగంధ్‌కుమార్ సింగ్, కరణ్ కుమార్ అనే ఇద్దరు యువకులు మిర్యాలగూడకు వచ్చారు. వీరు తమ రాష్ట్రానికి వెళ్లి వచ్చే సమయంలో వారి వెంట గంజాయిని తీసుకొచ్చి రైస్ మిల్లుల్లో పని చేసే మిర్యాలగూడ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన కుక్కల వంశీ, దైద జగదీష్, తాళ్లగడ్డకు చెందిన షేక్ హైమాద్, చైతన్యనగర్ కు చెందిన జంపాల నిఖిల్‌కు అలవాటు చేశారు. వీరు గంజాయిని సేవించడంతో పాటు బయట వ్యక్తులకు విక్రయిస్తే డబ్బులు సంపాదించవచ్చని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు వారిపై నిఘా పెట్టారు. శనివారం రోజు మాదిరిగా గంజాయిని విక్రయించేందుకు పట్టణ శివారు ప్రాంతమైన రాంనగర్ బంధం శ్రీ హనుమాన్ వెంచర్ కు వెళ్లగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.40 కిలోల గంజాయితో పాటు ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ నాగభూషణం, ఎస్‌ఐ సైదిరెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీను, నర్సింహ, బూర వీరబాబు, సంధ్య, ప్రసాద్ పాల్గొన్నారు.
● కిలో నలభై గ్రాముల గంజాయి,
ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ
రాజశేఖర రాజు