
జలనారాయణ స్వామికి మంగళహారతి
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం జల నారాయణ స్వామికి మంగళహారతులు సమర్పించారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి సుప్రభాతసేవ, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు.
నేడు స్వర్ణగిరి ఆలయం మూసివేత
సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం మూసివేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణ్ ఆచార్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు మూసివేసి తిరిగి సోమవారం ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆలయం తెరవనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నుంచి సోమవారం 2.30 గంటల వరకు ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు, దర్శనాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు.