
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలి
నాగార్జునసాగర్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని గురుకుల విద్యాలయ సంస్థ జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. శనివారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీలో గల బీసీ గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు పట్టిక, తరగతి గదులు, వంటగదిని పరిశీలించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు అందిస్తుందని తెలిపారు. పాఠశాల దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి సాధనకు నిరంతరం పాటుపడాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ రవికుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మాధవీలత, ఏటీపీ సంతోష్, సరిత తదితరులున్నారు.
● గురుకుల విద్యాలయ సంస్థ జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్ లాల్