
మూడేళ్లుగా మూలకు..
కోదాడ: మూడేళ్ల క్రితం బీఆర్‌ఎస్ హయాంలో బతుకమ్మ పర్వదినం సందర్భంగా మహిళలకు పంపిణీ చేసేందుకు పంపించిన దాదాపు మూడు వేల చీరలు సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర పంచాయతీ కార్యాలయంలో మూలన పడేశారు. తమ్మర పంచాయతీ కోదాడ మున్సిపాలిటీలో కలిసిన తరువాత నాలుగు గదులతో ఉన్న పంచాయతీ భవనంలో ఒక గదిలో పోస్టాఫీస్, మరొక గదిలో హెల్త్ సెంటర్ నిర్వహిస్తుండగా.. మరొక గదిలో మున్సిపాలిటీ సామగ్రి వేశారు. మిగిలిన గదిలో ఈ బతుకమ్మ చీరలు పడేశారు. ఈ చీరలను వచ్చే బతుకమ్మ పండుగకు అయినా పేద మహిళలకు పంపిణీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
● పంపిణీ చేయకుండా పంచాయతీ కార్యాలయంలో
పడేసిన బతుకమ్మ చీరలు