
అదే గోస.. అదే వరుస
యూరియా కోసం తప్పని బారులు.. రోడ్డెక్కుతున్న రైతులు
ఫ వేకువజామునుంచే క్యూలైన్‌లు ఫ పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ
అడ్డగూడూరు పీఏసీఎస్‌కు యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతులు
అడ్డగూడూరు : మడంల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి బుధవారం రాత్రి 440 బస్తాల యూరియా వచ్చింది. సమాచారం అందుకున్న వివిధ గ్రామాల రైతులు ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిల్చున్నారు. స్టాక్ తక్కువగా ఉండటంతో రైతులు ఎక్కవ సంఖ్యలో తరలిరావడంతో పోలీస్ బందోబస్తు మధ్య ఒక్కో రైతుకు ఒకటి, రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేశారు. శుక్రవారం మరో లోడ్ వస్తుదని, యూరియా అదని 228 మంది రైతులకు టోకెన్‌లు ఇచ్చినట్లు వ్యవసాయ అధికారి పాండురంగాచారి తెలిపారు.
రామన్నపేట: యూరియా కోసం పీఏసీఎస్ కార్యాలయానికి వచ్చిన రైతులు చిట్యాల–భువనగిరి రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుధవారం సాయంత్రం వచ్చిన లారీలోడ్ యూరియాను ఎవరికి ఇచ్చారో చెప్పాలని అధికారులను ప్రశ్నిం ఆరు. రాస్తారోకో గంట సేపటికి పైగా కొనసాగడంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ప్రైవేట్ డీలర్ల వద్ద ఉన్న యూరియాను ప్రభుత్వ ధరకే ఇప్పిస్తామని ఏఈవోలు, సీఐ వెంకటేశ్వర్లు ఎస్‌ఐ నాగరాజు రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. సీపీఎం జిల్లాకార్యదర్శివర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు బోయిని ఆనంద్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పోచబోయిన మల్లేశం, యూత్ అధ్యక్షుడు బత్తుల వెంకటేశం,మాజీ ఎంపీటీసీ గొరిగె నర్సింహ, మాజీ కో ఆప్సన్‌మెంబర్ ఎండీ ఆమేర్ రైతులకు మద్దతు తెలిపారు.
ఆలేరురూరల్: సొసైటీకి 440 యూరియా బస్తాలు రావడంతో సమాచారం అందుకున్న రైతులు భారీగా తరలివచ్చి క్యూలైన్‌లో నిలబడ్డారు. ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. యూరియా అందని రైతులు ఆందోళనకు దిగారు. అవసరానికి మించి యూరియా కొనుగోలు చేసి నిలువ ఉంచుకోవద్దని మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మొదటి విడతగా 1030 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని, ఇంకా 400 మెట్రిక్ టన్నులు యూరియా అవసరం అవుతుందని, రైతులందరికీ సరఫరా చేస్తామని చెప్పారు.

అదే గోస.. అదే వరుస

అదే గోస.. అదే వరుస