
బోధన వినూత్నం.. వరించిన పురస్కారం
ఫ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు ఎంపిక
ఫ నేడు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా అవార్డులు ప్రదానం
సంస్థాన్ నారాయణపురం: టీఆర్‌ఈఐఎస్ విభాగంలో సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్ గురుకుల కళాశాలకు చెందిన అర్థశాస్త్రం అధ్యాపకురాలు కొండ కవిత రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. కవిత 1996లో కాలేజీ సర్వీస్ కమిషన్ ద్వారా జూనియర్ ఆధ్యాపకురాలుగా ఎంపికై సర్వేల్ గురుకుల బాలుర కళాశాలలో చేరారు. ఇక్కడ పదేళ్ల పాటు పనిచేసి ఆ తరువాత హసనపర్తి, హైదరాబాద్‌లోని నాగోల్ మైనార్టీ కళాశాలో విధులు నిర్వహించారు. 2004లో బదిలీపై తిరిగి సర్వేల్ గురుకుల కళాశాలకు వచ్చారు. తన 29 ఏళ్ల సర్వీస్‌లో తాను బోధిస్తున్న అర్థశాస్త్రం సబ్జెక్ట్‌లో విద్యార్థులు ప్రతి సంవత్సరం 100 శాతం ఫలితాలు సాధిస్తూ వచ్చారు. చదువులో వెనకబడిన విద్యార్థులను ముందజలో ఉంచడంలో ఆమెకు ఆమె సాటి. ఆమె శిష్యుల్లో 50మందికి పైగా సీఏ పనిచేస్తున్నారు.