
లక్ష మందితో బీసీ సింహగర్జన
భువనగిరిటౌన్ : దసరా తర్వాత భువనగిరిలో లక్ష మందితో బీసీల సింహగర్జన నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. గురువారం భువనగిరిలోని ఎస్‌వీ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. చట్టంతో పాటు ఆర్డినెన్స్ చేయటంపట్ల సీఎం రేవంత్‌రెడ్డికి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన రిజర్వేషన్ బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆపటం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయ పార్టీలది గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాటగా ఉందని, నెల రోజులు పార్లమెంటు సమావేశాలు జరిగితే రిజర్వేషన్లపై మాట్లాడకపోవడం విచారకరమన్నారు. సింహగర్జన సభకు బీసీలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్‌చారి, జిల్లా అధ్యక్షుడు కొత్త నర్సింహస్వామి, నాయకులు మాటూరి ఆశోక్, నర్సింహచారి, వరికుప్పల మదు, బాబురావు, వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు
ఫ జాజుల శ్రీనివాస్‌గౌడ్