నేతన్నకు ఆర్థిక భరోసా.. | - | Sakshi
Sakshi News home page

నేతన్నకు ఆర్థిక భరోసా..

Jul 22 2025 6:18 AM | Updated on Jul 22 2025 9:23 AM

నేతన్

నేతన్నకు ఆర్థిక భరోసా..

ఫ నీట మునిగిన పత్తి

నేడు ఎన్జీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు

రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు సిద్ధమైంది. కళాశాల స్థాపించి 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా మంగళవారం కళాశాలలో వ్యవస్థాపక దినో త్సవం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కళాశాల యాజమాన్యం పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సముద్రాల ఉపేందర్‌ అధ్యక్షతన జరిగే కార్యక్రమానికి మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ అల్తాఫ్‌ హుస్సేన్‌, రిజిస్ట్రార్‌ అల్వాల రవి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. వీరితో పాటు తెలంగాణ కళాశాల విద్య జాయింట్‌ డైరెక్టర్లు డీఎస్‌ఆర్‌.రాజేంద్రసింగ్‌, పి.బాలభాస్కర్‌, రిటైర్డ్‌ జాయింట్‌ డైరెక్టర్‌, కళాశాల పూర్వ విద్యార్థులు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 2021–2022 నుంచి 2023–2024 విద్యా సంవత్సరం వరకు వివిధ సబ్జెక్టుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు.

50 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా

నా వయస్సు 63 సంవత్సరాలు. గత 50 ఏళ్లుగా మగ్గం నేసి జీవనం సాగిస్తున్నా. కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నా. దాంతో ఏడాదికి 5 నుంచి 6 వార్పుల కంటే ఎక్కువ నేయలేను. ఒక్కోసారి నూలు, వార్పు అందక ఆలస్యం అవుతుంది. కాబట్టి వార్పులను పరిగణలోకి తీసుకోకుండా జియోట్యాగింగ్‌ కల్గిన ప్రతిమగ్గం, అనుబంధ కార్మికులకు భరోసా ఇవ్వాలి –కొక్కుల ఆయోధ్య,

చేనేత కార్మికుడు, భూదాన్‌పోచంపల్లి

వార్పులను తగ్గించడం సంతోషం

నేతన్న భరోసాలో 8 నుంచి 10 వార్పులు నేయాలనే నిబంధన వల్ల వృద్దాప్యంలో ఉన్న చేనేత కార్మికులు నేయలేరు. దాంతో చాలా మంది నష్టపోతారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులను కలిసి విన్నవించాం. అధికారులు కూడ సానుకూలంగా స్పందించి 4 నుంచి 8 వార్పులకు తగ్గించడం సంతోషం. జిల్లాలో నేతన్న భరోసా కింద రూ.16.25 కోట్ల ఆర్థిక ప్రయోజనం జరగనుంది. ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలి

–అంకం పాండు, చేనేత కార్మిక సంఘం

అధ్యక్షుడు, భూదాన్‌పోచంపల్లి

నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ

‘నేతన్నకు భరోసా’ పథకం కింద ఏటా రెండు విడతల్లో నగదు జమ

ప్రధాన, అనుబంధ కార్మికుడికి ప్రోత్సాహం

జిల్లాలో 13,542 మందికి ప్రయోజనం

భూదాన్‌పోచంపల్లి: చేనేత కార్మికులకు ఆర్థిక చేయూత అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నేతన్న భరోసా పథకం ద్వారా చేనేత, అనుబంధ కార్మికులకు ప్రోత్సాహం అందించనుంది. ఇందుకోసం మంగళవారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు చేనేత జౌళిశాఖ అధికారులు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులను ప్రభుత్వానికి నివేదించిన అనంతరం మొదటి విడతగా ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 6 నెలల మొత్తాన్ని సెప్టెంబర్‌ నెలాఖరు వరకు కార్మికుల ఖాతాలో డీబీటీ ద్వారా నేరుగా జమ చేయనుంది.

జియోట్యాగింగ్‌ మగ్గాలు 6,771

జిల్లాలో 6,771 జియోట్యాగింగ్‌ కల్గిన మగ్గాలు ఉన్నాయి. కాగా నేతన్న భరోసా పథకం మగ్గం నేసే కార్మికుడితో పాటు రంగులద్దే, వార్పు, చిటికికట్టే, నూలువడికే ఏదో ఒక అనుబంధంగా పనిచేసే కార్మికుడు కూడా అర్హుడే. మగ్గం నేసే కార్మికుడికి ఏడాదికి ప్రభుత్వం రూ.18వేలు, అనుబంధ కార్మికుడికి రూ.6వేల చొప్పున ప్రభుత్వం నగదు అందజేస్తుంది.ఈ లెక్కన మగ్గం నేసేవారు, అనుబంధ కార్మికుడితో కలుపుకొని జిల్లాలో 13,542 మంది కార్మికులకు రూ.16.25 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలుగనుంది. ఈ మొత్తం ప్రభుత్వం ప్రతి ఆరునెలల ఒకకసారి జమ చేయనుంది.

రెండు ఫారాలు నింపాలి

నేతన్నకు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునే కార్మికలు రెండు ఫారాలి నింపాల్సి ఉంటుంది. ఇందులో ఫారమ్‌–ఏలో మగ్గం నేసే కార్మికుడి, అనుబంధ కార్మికుడి వివరాలు, ఫారమ్‌ –బీలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన తెలంగాణ హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్‌ లోగోకు సంబంధించి కార్మికుడు తాము తయారు చేసే చీరె, వస్త్రం వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. అదేవిధంగా మగ్గం నేసే కార్మికుడి, అనుబంధ కార్మికులిద్దరి ఆధార్‌కార్డులు, ఆధార్‌కు లింక్‌ చేయబడిన బ్యాంకు ఖాతాను వివరాలను జతపర్చాలి.

నాలుగు క్లస్టర్లు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న చేనేత ప్రభావిత మండలాలను నాలుగు క్లస్టర్లుగా విభజించి అధికారులు నేత కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అందులో ఒకటో క్లస్టర్‌లో భూదాన్‌పోచంపల్లి, రెండవ క్లస్టర్‌లో చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, మూడో క్లస్టర్‌లో భువనగిరి, వలిగొండ, రామన్నపేట, నాలుగో క్లస్టర్‌లో గుండాల, మోత్కూర్‌, ఆత్మకూర్‌(ఎం), మోటకొండూర్‌ మండలాలు ఉన్నాయి.

సద్వినియోగం చేసుకోవాలి

మంగళవారం నుంచి ఈ నెల 31 వరకు దరకాస్తులను స్వీకరిస్తారు.పారదర్శకత కోసం ఇతర జిల్లాల అధికారులను నియమించారు.ప్రతి కార్మికుడు ఫారమ్‌ ఏ, ఫారమ్‌ బీ రెండు ఫారాలను నింపి ఇవ్వాలి. అలాగే ఇద్దరి ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాసుపుస్తకం జతచేయాల్సి ఉంటుంది. నేతన్నలకు ఎంతో ఉపయోగకరమైన ఈ పథకాన్ని కార్మికులంతా సద్వినియోగం చేసుకోవాలి.

–శ్రీనివాసరావు, జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ

సడలిన నిబంధనలు

నేతన్న భరోసా కింద చేనేత కార్మికుడు ఏడాదికి 8 నుంచి 10 వార్పులు అనగా 42 చీరల నుంచి 70 చీరలు నేయాల్సి ఉంది. ముందుగానే కార్మికులు ఒప్పంద పత్రం కూడా రాసి ఇవ్వాలి. అయితే ప్రభుత్వం విధించిన నిబంధన చేనేత కార్మికులకు గుదిబండగా మారడంతో చేనేత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.ఇటీవల భువనగిరిలో నిర్వహించిన నేతన్న భరోసా అవగాహన సదస్సులో నిబంధనలను సడలించాలని నేతన్నలంతా నినదించారు.అంతేకాక సమస్యను చేనేతజౌళిశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అధికారులు కార్మికుల అభ్యర్థను పరిగణనలోకి తీసుకొని ప్రస్తుతం కనిష్టం 4 వార్పుల నుంచి గరిష్టంగా 8 వార్పులకు తగ్గించారు.

నేతన్నకు ఆర్థిక భరోసా.. 1
1/3

నేతన్నకు ఆర్థిక భరోసా..

నేతన్నకు ఆర్థిక భరోసా.. 2
2/3

నేతన్నకు ఆర్థిక భరోసా..

నేతన్నకు ఆర్థిక భరోసా.. 3
3/3

నేతన్నకు ఆర్థిక భరోసా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement