
మధుసూదన్‌రెడ్డి మృతికి సంతాపం
మర్రిగూడ: తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ కుంభం మధుసూదన్‌రెడ్డి(90) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో తన నివాసంలో మృతిచెందారు. ఆయన స్వస్థలం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామం కాగా.. ఆయన సేవలను గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. మధుసూదన్‌రెడ్డి 1935లో శివన్నగూడెం గ్రామంలో చినశివారెడ్డి, రంగనాయకమ్మ దంపతులకు జన్మించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమకాలంలో కవి అందెశ్రీతో పాటు రాష్ట్ర కళాకారులతో మర్రిగూడ మండల కేంద్రంలో ఆయన ధూంధాం కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలను జాగృతం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన సలహాదారులుగా కూడా ఆయన పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా, రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన పలు అంశాలపై దేశ, విదేశాల్లో పలు సదస్సులు నిర్వహించి పరిశోధన వ్యాసాలు రాశారు. మధుసూదన్‌రెడ్డికి భార్య విమల, ముగ్గురు కుమార్తెలు నళిని, అరుంధతి, గాయత్రి ఉన్నారు. మధుసూదన్‌రెడ్డి మృతదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు బుధవారం ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. మధుసూదన్‌రెడ్డి మృతి విషయం తెలుసుకున్న సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఫ ఓయూ మాజీ ప్రిన్సిపాల్ సేవలను గుర్తుచేసుకున్న శివన్నగూడెం