
సొంత బిడ్డల్లా చూసుకోవాలి
సాక్షి,యాదాద్రి : ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం భువనగిరి కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం హాస్టల్స్‌లో చదివే వి ద్యార్థుల సంఖ్య బాగా పెరిగిందని వారిపై ప్రత్యేక శ్రద్ధ చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్‌సీఓలు, విద్యారాణి స్వప్న, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి యాదయ్య , జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి శ్యామ్ సుందర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, డీఈఓ సత్యనారాయణ, వివిధ హాస్టల్ ప్రిన్సిపాల్స్, స్పెషల్ ఆఫీసర్స్, కేర్ టేకర్‌లు పాల్గొన్నారు.
మాతృ మరణాలను నియంత్రించాలి
భువనగిరి : జిల్లాలో మాత్ర మరణాల నియంత్రణకు గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద చూపించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భువనగిరి కలెక్టరేట్‌లో మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గర్భిణులకు హైరిస్క్ గర్భిణులను గుర్తించి వారికి మెరుగైన వైద్యసేవలందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలన్నారు. అనంతరం సీ్త్ర వైద్యనిపుణులు నిర్మల, కవిత.. ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత అందించే సేవల గురించి వివరించారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మనోహర్, పిల్లల వైద్యులు కరణ్‌రెడ్డి, మోహన్, మత్తు వైద్యనిపుణులు రెహమాన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు డాక్టర్ యశోద, శిల్పిని, ఇమ్యూనైనేషన్ జిల్లా అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నేడు మహిళా శక్తి సంబరాలు
భువనగిరిటౌన్ : ఈ నెల 16న భువనగిరి పట్టణంలోని ఏఆర్ ఫంక్షన్ హాల్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు మంగళవారం ఓప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు
కేంద్రీయ విద్యాలయంలో నాణ్యమైన విద్య
భువనగిరి : కేంద్రీయ విద్యాలయం(కేవీ)లో నాణ్య మైన విద్య అందుతుందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. భువనగిరి కేవీలో 2వ తరగతిలో ప్రవేశాల కోసం మంగళవారం కలెక్టరేట్‌లో లక్కీ డ్రా తీసిమాట్లాడారు. కార్యక్రమంలో కేవీ ప్రిన్సిపాల్ ఎన్.చంద్రమౌళి, ఇన్‌చార్జి మనిషా శుక్లా, కమిటీ సభ్యులు శ్రీపాద అనందకుమార్, అంకిత్ తదితరులు పాల్గొన్నారు.

సొంత బిడ్డల్లా చూసుకోవాలి