అపరాల సాగులో చీడపీడలు, నివారణ మార్గాలు | - | Sakshi
Sakshi News home page

అపరాల సాగులో చీడపీడలు, నివారణ మార్గాలు

Jul 7 2025 5:57 AM | Updated on Jul 7 2025 5:57 AM

అపరాల

అపరాల సాగులో చీడపీడలు, నివారణ మార్గాలు

పొగాకు లద్దె పురుగు

ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్ధాన్ని గీకి తినడం వల్ల ఆకులు తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా, పూలను, పిందెలను తింటాయి. ఈ పురుగులు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలో చేరుతాయి. దీని నివారణకు గుడ్ల సముదాయం ఏరివేయాలి. ఎకరానికి 10 లింగాకర్షణ బుట్టలు పెట్టి తల్లిపురుగుల ఉధృతిని గమనించాలి. ఈ పురుగు తొలిదశలో మోనోక్రోటోఫాస్‌ 1.5 మందు లీటరు నీటికి కలిపి మొక్కలు తడిచేలా పిచికారీ చేయాలి. పురుగులు పెద్దవై ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు సాయంత్రం వేళ విషపు ఎరలను 5కిలోల తవుడు, అరకిలో బెల్లం, 1.5 లీటరు మోనోక్రోటోఫాస్‌ మందు కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచి పురుగులను నివారించుకోవాలి.

గుర్రంపోడు: వానాకాలం సీజన్‌లో వరి సాగుకు ముందు చాలామంది రైతులు మినుము, పెసర సాగుచేస్తుంటారు. అంతేకాకుండా పండ్ల తోటల్లో అంతరపంటగా సాగు చేసే పెసర, మినుము పంటల్లో చీడపీడల నివారణకు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈ పంటల విషయంలో ఎరువుల యాజమాన్యం, మినుము, పెసర పంటలకు సోకే పురుగులు, తెగుళ్లు.. వాటి నివారణపై గుర్రంపోడు మండల వ్యవసాయాధికారి కంచర్ల మాధవరెడ్డి అందిస్తున్న సలహాలు, సూచనలు..

చిత్త పురుగు

ఈ పురుగు రెండు ఆకుల దశలో ఎక్కువగా ఆశించడం వల్ల మొక్కల్లో పెరుగుదల లేక లేత మొక్కలు చనిపోతాయి. చిత్త పురుగులు సాయంత్రం, రాత్రి వేళ ఆకులను తిని నష్టపరుస్తాయి. ఆకులపై గుండ్రని రంధ్రాలు గమనించడం వల్ల చిత్తపురుగుల ఉనికిని గుర్తించవచ్చు. చిత్త పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటే లీటరు నీటికి రెండు గ్రాముల మోనోక్రోటోఫాస్‌ను కలిపి పిచికారీ చేయాలి.

కాండపు ఈగ

ఈ పురుగు తొలిదశలో సుమారు 30 రోజుల వరకు మాత్రమే నష్టం కల్గిస్తుంది. కాండపు ఈగ ఆశించిన మొక్కల్లో తల చివరి ఆకులు వడలిపోతాయి. లేత మొక్కలు పసుపురంగుకు మారి మొక్క ఎండిపోతుంది. భూమికి దగ్గరగా మొక్క మొదలు దగ్గర కాండం ఉబ్బి మొక్కలు గిడసబారి ఎండిపోతాయి. నివారణకు ఎసిఫేట్‌ ఒక గ్రాము లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

తామర పురుగులు

తామర పురగులు ఆశించిన మొక్కల్లో పెరుగుదల తగ్గి గిడసబారిపోతాయి. తామర పురుగులు ఆకుల నుంచి రసం పీల్చడమేగాకుండా ఆకుముడత అనే వైరస్‌ వ్యాధిని కలుగజేస్తుంది. దీని నివారణకు ఎసిఫేట్‌ ఒక గ్రాము లీటరు నీటికి లేదా పిప్రోనిల్‌ ఒక మిల్లీలీటరు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

తెల్లదోమ

తెల్లదోమ రెక్కల పురుగులు, పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగం నుంచి రసం పీల్చడం వల్ల ఆకుల ముడతలు పడి క్రమేపీ ఎండి రాలిపోతాయి. తెల్లదోమ సోకిన మొక్కలు అడుగుభాగంలో గల ఆకులపై నల్లటి బూజు ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ సరిగా జరగకపోవడం వల్ల మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఈ పురుగులు ఆకుల్లోని రసాన్ని పీల్చడమేగాకుండా కాక పల్లాకు తెగులును, వైరస్‌ తెగులును వ్యాపింపజేస్తాయి. దీని నివారణకు 1.5 మిల్లీలీటరు ట్రైజోఫాస్‌ మందును లేదా ఒక గ్రాము ఎసిఫేట్‌ మందును లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

మారాకు మచ్చల పురుగు

తల్లి పురుగు పూ మొగ్గలపై, ఆకులపై , పిందెలపై 2–16 గుడ్ల సముదాయంగా పెడుతుంది. గుడ్ల నుంచి 4–5 రోజుల్లో పిల్ల పురగులు వెలుపలికి వస్తాయి. లార్వాలు పురుగు మొగ్గ, పూత పిందె దశల్లో ఆశించి ఎక్కువ నష్టం కలుగుజేస్తాయి. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్ధాలను తింటాయి. కాయలకు రంధ్రం చేసి లోపలికి గింజలనపు తినడం వల్ల పంటలకు ఎక్కువ నష్టం కల్గిస్తుంది. మారాకు మచ్చల పురుగు నివారణకు పూతకు ముందే 5 శాతం వేపగింజల కషాయం లేదా లీటరు నీటికి 2.5 మి.లీ క్లోరోఫైరిఫాస్‌ లీటరునీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఆకుమచ్చ తెగులు

ఈ తెగులు సోకిన ఆకులపై చిన్నచిన్న గుండ్రని మచ్చలు ఏర్పడి పెద్ద మచ్చలుగా మారి ఆకులు ఎండి రాలిపోతాయి.

బూడిద తెగులు

విత్తిన 30–35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదరు ఆకులపై బూడిద రూపంలో చిన్నచిన్న మచ్చలు పడి అవి క్రమేణా ఆకులపైనా క్రింది భాగాలకు కొమ్మలకు కాయలకు వ్యాపిస్తాయి.

నివారణ చర్యలు

పెసర, మినుము పంటలో ఆశించే ఆకుమచ్చ, బూడిద తెగుళ్ల నివారణకు 30 నుంచి 35 రోజల దశల్లో కాపర్‌ఆక్సీక్లోరైడ్‌ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి తెగుళ్లను సమర్ధవంతంగా అరికట్టవచ్చు.

అపరాల సాగులో చీడపీడలు, నివారణ మార్గాలు1
1/2

అపరాల సాగులో చీడపీడలు, నివారణ మార్గాలు

అపరాల సాగులో చీడపీడలు, నివారణ మార్గాలు2
2/2

అపరాల సాగులో చీడపీడలు, నివారణ మార్గాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement