బాల కార్మిక వ్యవస్థను రూపుమాపుదాం
భువనగిరిటౌన్: బాలకార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పిలుపునిచ్చారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, యజ మానులపై కేసులు నమోదు చేయడంతో పాటు రెండేళ్ల జైలుశిక్ష, రూ.50వేల జరిమానా ఉంటుందన్నారు. బాలకార్మిక చట్టాలపై అవగాహన కల్పించేందుకు గ్రామాలు, పట్టణాల్లో సదస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాగిరెడ్డి, రమణి, మోయిజుద్దీన్, సీడీపీఓ శైలజ, బాలల పరిరక్షణ విభాగం, విద్యాశాఖ, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు


