వలస జీవుల వివరాల సేకరణ | - | Sakshi
Sakshi News home page

వలస జీవుల వివరాల సేకరణ

May 29 2025 10:04 AM | Updated on May 29 2025 10:04 AM

వలస జ

వలస జీవుల వివరాల సేకరణ

ఆలేరు: జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యాపారం, వాణిజ్య పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు ఇతర రాష్ట్రాలకు చెందిన వందలాది మంది వలస వస్తున్నారు. వ్యాపార నిమిత్తం కొందరు, జీవనోపాధి కోసం మరికొందరు వచ్చి వివిధ ప్రాంతాల్లో తిష్ట వేస్తున్నారు. కొందరు సరైన పత్రాలు లేకుండా ఇక్కడ ఉంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనేపథ్యంలో భద్రతా అంశాల పరంగా పోలీసులు అలాంటి వారిపై దృష్టి సారించారు. ఈ మేరకు బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, కేరళ, తమిళనాడు ఇతర రాష్ట్రాలకు చెందిన వలస జీవులు జిల్లాలో ఎంతమంది ఉన్నారనే కోణంలో కూపీ లాగుతున్నారు. వారి నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

వివరాల సేకరణకు ఇదొక కారణం

భారత్‌–పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో రోహింగ్యాలు ఎవరైనా ఉన్నారా? అనే సందేహాల్లో భాగంగా అధికారులకు ఫిర్యాదులు వెళ్లడం కూడా పోలీసుల వివరాల సేకరణకు ఒక కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లాలోని భువనగిరి, యాదాద్రి, చౌటుప్పల్‌ పోలీసు డివిజన్లలో 19 పోలీస్‌స్టేషన్లు ఉండగా.. ఆయా ఠాణాల పరిధిలో ఏయే రాష్ట్రాలకు చెందిన వారు ఎంతమంది ఉంటున్నారనే వివరాల సేకరణలో పోలీసులు నిమగ్నమయ్యారు.

వివరాల నిర్ధారణ

ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల ఆధార్‌కార్డు, సెల్‌నంబర్లు తదితర పూర్తి సమాచారం పోలీసులు సేకరిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా వారు వాస్తవానికి అదే రాష్ట్రానికి చెందిన వారేనా? ఆధార్‌కార్డు ఒరిజినలా.. కాదా? అని పోలీసులు నిర్ధారించుకుంటున్నారు. వారు ప్రధానంగా ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నారు. ఎంత మంది ఇక్కడికి వచ్చారు. స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారా.. ఎన్ని నెలలకు వారి సొంత రాష్ట్రాలకు వెళ్లి, మళ్లీ ఎప్పుడు తిరిగి వస్తున్నారు. ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే తదుపరి చర్యలపై పోలీసులు దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

సేఫ్‌ అండ్‌ సెక్యూరిటీ కోసమే..

జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నది నిజమే. జవాబుదారీతనంతోపాటు సేఫ్‌ అండ్‌ సెక్యూరిటీలో భాగంగా ఈ వివరాలు సేకరిస్తున్నాం. సున్నితమైన ఘటనలు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, లేదా ఎవరైనా మృతి చెందినప్పుడు వారి గురించి అవసరమైన అదనపు సమాచారం తెలుసుకోవడానికి ఈ వివరాలు దోహదపడతాయి.

– ఆక్షాంశ్‌యాదవ్‌, డీసీపీ, భువనగిరి

జిల్లాలో ఇతర రాష్ట్రాల వారి వివరాలపై ఆరా తీస్తున్న పోలీసు యంత్రాంగం

ఆధార్‌కార్డు, సెల్‌నంబర్ల

సమాచారం సేకరణ

వలస జీవుల వివరాల సేకరణ1
1/1

వలస జీవుల వివరాల సేకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement