
కారు బైక్ ఢీ.. యువకుడికి గాయాలు
ఆలేరురూరల్: కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో యువకుడికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆలేరు మండలంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన బింగి దామోదర్ పనినిమిత్తం ఆలేరుకు వచ్చి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. కొలనుపాక వాగు వద్దకు రాగానే బచ్చనపేట నుంచి కారు ఆలేరుకు వెళ్తుండగా రెండు వాహనాలు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న దామోదర్‌కు గాయాలయ్యాయి, అతడిని స్థానికులు వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆలేరు పోలీసులను సంప్రదించగా.. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.