
మెళకువలు పాటిస్తే అధిక దిగుబడులు
ఫ శాస్త్రవేత్తలు భద్రునాయక్, అనిల్‌కుమార్
చౌటుప్పల్ రూరల్ : రైతులు పంటల సాగులో మెళకువలు పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ భద్రునాయక్, డాక్టర్ అనిల్‌కుమార్ సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సోమవారం చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం రైతువేదికలో నిర్వహించిన సదస్సులో వారు పాల్గొని రైతులకు సూచనలు, సలహాలు చేశారు. ఆధునిక పద్ధతులు అందిపుచ్చుకోవాలని, భూసార పరీక్షలు చేయించి నేల స్వభావాన్ని బట్టి పంటలు వేయాలని సూచించారు. ఎరువుల వాడకం, రసాయనాలు తక్కువ మోతాదులో వాడాలన్నారు. శాస్త్రవేత్తలు, వ్వయసాయ అధికారుల సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పల్లె శేఖర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రాసేనారెడ్డి, మండల వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.