
సీఐ.. ఇక ఠాణా బాస్
ఆలేరు: ప్రజలకు పోలీస్ సేవలు చేరువలో ఉండేలా ఆ శాఖ చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా పాలనాసౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా స్షేషన్ల స్థాయిని పెంచడంతో పాటు అదనపు సిబ్బందిని నియమిస్తోంది. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ఆలేరు ఠాణాను అప్‌గ్రేడ్ చేసింది. ఇప్పటి వరకు ఎస్‌ఐ.. స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌ఓ)గా వ్యవహరిస్తుండగా.. ఇకపై సీఐ పర్యవేక్షణలో కార్యకలాపాలు కొనసాగనున్నాయి. యాదగిరిగుట్ట రూరల్ సీఐ కొండల్‌రావును ఆలేరు ఠాణా తొలి ఎస్‌హెచ్‌ఓగా నియమిస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు ఇచ్చారు.
పెరగనున్న సిబ్బంది
స్టేషన్ స్థాయి పెరిగిన నేపథ్యంలో అదనపు సిబ్బంది రానున్నారు. ప్రస్తుతం ఎస్‌తో పాటు 21 మంది కానిస్టేబుల్స్, నలుగురు హెడ్‌కానిస్టేబుల్స్ ఉన్నారు. ఇప్పుడు సీఐతోపాటు అదనంగా ఎస్‌ఐ రానున్నారు. ప్రస్తుత ఠాణా కేటగిరీ ఏ లేదా బీకి పెంచి, అదనపు కానిస్టేబుల్స్, ఇతర సిబ్బందిని నియామకం చేయనున్నారు.
ఆలేరు పోలీస్‌స్టేషన్ స్థాయి పెంపు
ఫ ఎస్‌హెచ్‌ఓగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్
ఫ ఇక సీఐ పర్యవేక్షణలో కార్యకలాపాలు
ఫ త్వరలో మరొక ఎస్‌ఐ,అదనపు సిబ్బంది నియామకం
ఫ వేగవంతంగా కేసుల పరిశోధన
మెరుగైన సేవలే లక్ష్యం
అప్‌గ్రేడ్ వల్ల స్టేషన్‌లో ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండే అవకాశం కలుగుతుంది. విజ బుల్ పోలీసింగ్ పెరగనున్నది. తద్వారా సమస్యలపై ఠాణాకు వచ్చే ప్రజలకు సత్వర సేవలు అందనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్ మెరుగుపడతాయి. నేరాలను పరిశోధించే సాక్ష్యాల సేకరణ, దర్యాప్తు పద్ధతులు మరింత సులువవుతాయి. ప్రస్తుతం ఒక సీఐ, ఒక ఎస్‌ఐ ఉంటారు. త్వరలోనే మరో ఎస్‌ఐని, ఇతర అదనపు సిబ్బందిని నియమిస్తాం. మెరుగైన సేవలు అందించాలనేది లక్ష్యం.
–సుధీర్‌బాబు, రాచకొండ సీపీ

సీఐ.. ఇక ఠాణా బాస్