
అభినయ శ్రీనివాస్‌కు గద్దర్ ఐకాన్ అవార్డు
మోత్కూరు: ‘ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా’ వంటి ఉద్యమ గీతాన్ని రాసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మోత్కూరు వాసి అభినయ శ్రీనివాస్‌కు గద్దర్ ఐకాన్–2025 అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని బిర్లా మందిర్ ప్రాంగణంలోని భాస్కర్ ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన సాయి అలేఖ్య ఫౌండేషన్ వారి 32వ వార్షికోత్సవ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ చేతులమీదుగా అభినయ శ్రీనివాస్‌కు ఈ అవార్డును నిర్వాహకులు ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు పట్నం మహేందర్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, అవార్డుల కమిటీ అధ్యక్షురాలు అలేఖ్య, తెలంగాణ రచయితలు, గాయకులు తదితరులు పాల్గొన్నారు.