
ఆర్టీఐ కమిషనర్ల నియామకాన్ని పునఃపరిశీలించాలి
రామగిరి(నల్లగొండ): ఆర్టీఐ కమిషనర్లుగా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని.. ప్రస్తుతం జరిగిన ఆర్టీఐ కమిషనర్ల నియమాకాన్ని పునఃపరిశీలించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన ఆర్టీఐ కమిషనర్ల నియామకాన్ని పునఃపరిశీలించాలని శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గాదె వినోద్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే సమాచార కమిషనర్లుగా న్యాయబద్ధంగా వ్యవహరించే వారిని నియమించాలని కోరారు. సమాచార కమిషనర్ల నియామకంలో పారదర్శకత పాటించాలని అనర్హులను ఎంపిక చేయొద్దని అన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండీ రజీవుద్దిన్, సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తలారి రాంబాబు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్, సమాచార హక్కు సంరక్షణ సమితి అధ్యక్షుడు బండమీది అంజయ్య, ఆశ్రిత సంస్థకు చెందిన ధనమ్మ, సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బైరు సైదులుగౌడ్, చిత్రం శ్రీనివాస్, ఆర్టీఐ కార్యకర్త కుడుతల రవీందర్, ఎస్సీ, ఎస్టీ చైర్మన్ గాదె యాదగిరి, ఆశ్రిత సంస్థ సభ్యులు శోభ, ఎం. శోభారాణి, అమత, రాజు, సీతా, వంశీ, కె. వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.