పట్టణాల గొంతెండుతోంది! | - | Sakshi
Sakshi News home page

పట్టణాల గొంతెండుతోంది!

May 4 2025 6:31 AM | Updated on May 4 2025 6:31 AM

పట్టణ

పట్టణాల గొంతెండుతోంది!

సాక్షి, యాదాద్రి : మున్సిపాలిటీలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఎండ తీవ్రత పెరగడం, మరోవైపు మిషన్‌ భగీరథ నీరు తగినంత సరఫరా కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బోర్ల నీటిని కలిపి పంపిణీ చేస్తున్నా, ప్రత్యామ్నాయంగా ట్యాంకర్లు ఏర్పాటు చేసినా సరిపోను నీళ్లు రావడం లేదని జనం గగ్గోలు పెడుతున్నారు. పలుచోట్ల రోజువారీ అవసరాలకోసం ప్రైవేట్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని పోయించుకుంటున్నారు. తాగడానికి ఆర్వో ప్లాంట్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అధికారులు చెబుతున్నా సమస్య తీర్చలేకపోతున్నారు.

● భువనగిరి మున్సిపాలిటీ జనాభా సుమారు 75 వేలు. ప్రభుత్వ నీటి లెక్కల ప్రకారం పట్టణానికి రోజుకు 11 ఎంఎల్‌డీల నీరు అవసరం. కానీ ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ నుంచి 5.44 ఎంఎల్‌డీలు మాత్రమే వస్తోంది. చాలా ప్రాంతాల్లో మూడు రోజులకు ఒకసారి నీటిని విడుస్తున్నారు. సమస్యను అధిగమించేందుకు స్థానిక బోర్ల నీటిని కలిపి సరఫరా చేస్తున్నారు. నీరు కలుషితం అవుతుండడంతో తాగలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆర్వో ప్లాంట్ల నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. భగీరథ నీటిని అవసరాలకు వినియోగిస్తున్నారు.

● యాదగిరిగుట్టలో రోజు విడిచి రోజు నల్లాల ద్వారా నీరు వదులుతున్నారు. పట్టణ జనాభా 25వేలకు పైగా ఉంది. రోజుకు 12లక్షల లీటర్ల నీరు అవసరం. మిషన్‌ భగీరథ నీరు 60 శాతం మాత్రమే వస్తుంది. ప్రశాంత్‌నగర్‌, గాంధీనగర్‌, హనుమాన్‌ వీధిలో పది రోజులుగా మిషన్‌ భగీరథ నీళ్లు రావడంలేదు. ప్రత్యామ్నాయంగా బోర్ల నీటిని కలిపి, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.

● మోత్కూరు పట్టణ జనాభా సుమారు 18వేలు ఉంటుంది. రోజుకు 2.84 ఎంఎల్‌డీల నీరు అవసరం. మిషన్‌ భగీరథ ద్వారా 1.54 ఎంల్‌డీలు మాత్రమే వస్తుంది. బోర్ల ద్వారా 1.30 ఎంఎల్‌డీల నీటిని మిషన్‌ భగీరథ నీటితో కలిపి సరఫరా చేస్తున్నారు. కొన్ని రోజులుగా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు.

మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తీవ్రం.. ట్యాంకర్ల ద్వారా సరఫరా

బోర్ల నీళ్లే దిక్కు

ప్రశాంత్‌నగర్‌లో పది రోజు లుగా మిషన్‌ భగీరథ నీరు రావడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోరు నీళ్లే దిక్కవుతుంది. అధికారులు చొరవచూపి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలి.

–నవీన్‌ ఠాగుర్‌, ప్రశాంత్‌నగర్‌, యాదగిరిగుట్ట

రెండు రోజులకోసారి సరఫరా..

సినిమా టాకీస్‌ గల్లీ ఎదురుగా ఉన్న ప్రాంతంలో రెండు రోజులకోసారి నీరు వస్తుంది. గతంలో గంటకు పైగా నీరు వచ్చేది. ప్రస్తుతం పావుగంట కూడా రావడం లేదు. వచ్చేది కూడా భగీరథ నీళ్లో, బోర్ల నీళ్లో తెలియడం లేదు. కనీసం అరగంటైనా నీటిని వదలాలి.

–కప్పల వసంత, మోత్కూరు

గత నెల రూ.3వేలు వెచ్చించాం

తాగునీటికోసం ఇబ్బంది ప డుతున్నాం. మూడు రోజు లకు ఒకసారి మున్సిపాలిటీ ట్యాంకర్‌ ద్వారా నీళ్లు పోస్తున్నారు. అవి సరిపోవడం లేదు. ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నాం. గత నెల రూ.3వేలు వెచ్చించి కొనుగోలు చేశాం నీటిని కొనడం భారంగా మారింది.

–వి.మీనాక్షి, రత్నానగర్‌, చౌటుప్పల్‌

ఫ మిషన్‌ భగీరథ నీటిలో బోర్ల నీళ్లు కలిపి సరఫరా చేస్తున్నా కటకటే..

ఫ ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ఏర్పాటు

ఫ మున్ముందు నీటి కష్టాలు మరింత పెరిగే అవకాశం

చౌటుప్పల్‌లో ఇలా..

చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో ప్రధానంగా 7,16,17,18,19 వార్డుల పరిధిలోని హనుమాన్‌నగర్‌, రత్నానగర్‌, బంగారిగడ్డ, సుందరయ్య కాలనీ, బస్టాండ్‌ ఏరియా ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. చౌటుప్పల్‌ మున్సిపాలిటీకి మిషన్‌ భగీరథ ద్వారా 6ఎంఎంల్‌డీల నీరు రావాలి. ప్రస్తుతం 2.5 ఎంఎల్‌డీల నీరు మాత్రమే వస్తుంది.

పట్టణాల గొంతెండుతోంది!1
1/6

పట్టణాల గొంతెండుతోంది!

పట్టణాల గొంతెండుతోంది!2
2/6

పట్టణాల గొంతెండుతోంది!

పట్టణాల గొంతెండుతోంది!3
3/6

పట్టణాల గొంతెండుతోంది!

పట్టణాల గొంతెండుతోంది!4
4/6

పట్టణాల గొంతెండుతోంది!

పట్టణాల గొంతెండుతోంది!5
5/6

పట్టణాల గొంతెండుతోంది!

పట్టణాల గొంతెండుతోంది!6
6/6

పట్టణాల గొంతెండుతోంది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement