
రైతు సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షుడిగా గుత్తా మోహన్‌రెడ్డి
చిట్యాల: చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామానికి చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి గుత్తా మోహన్‌రెడ్డి తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన సమాఖ్య ఎన్నికల్లో ఆయనను ఎన్నికయ్యారు. మోహన్‌రెడ్డి 1978లో ఎన్‌జీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేసి మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేయడంతో పాటు 1978, 1985లో నల్లగొండ శాసన సభ నియోజకవర్గ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షుడిగా గుత్తా మోహన్‌రెడ్డి ఎన్నిక కావటం పట్ల పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు.