
‘మట్టికాళ్ల ముట్టడి’ పుస్తకావిష్కరణ
మిర్యాలగూడ: ప్రముఖ కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కస్తూరి ప్రభాకర్ పదవీ విరమణ సందర్భంగా గురువారం మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన రాసిన ‘మట్టికాళ్ల ముట్టడి’ పుస్తకంతో పాటు మధనం, ప్రభాకర చలనం పుస్తకాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు కేతావత్ శంకర్‌నాయక్, గోరేటి వెంకన్న, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ తదితరులు ఆవిష్కరించారు. ప్రభాకర్ కవిగా, రచయితగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అనేక సేవలు అందించారని, ఉద్యోగ విరమణ తర్వాత కూడా తన సేవలను కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, ప్రముఖ కార్టూనిస్ట్ నర్సింహ, మాజీ జెడ్పీ చైర్మన్ సీడీ. రవికుమార్, మానవ హక్కుల వేదిక నాయకుడు పి. సుబ్బారావు, భువనగిరి ఎంఈఓ నాగవర్ధన్‌రెడ్డి, సాహితీవేత్తలు ఉప్పల పద్మ, పెరుమాళ్ల ఆనంద్, సాగర్ల సత్తయ్య, పందుల సైదులు, నాయకులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, చిలుకూరు బాలు తదితరులు పాల్గొన్నారు.