
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి
ఆలేరురూరల్: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతరావు డిమాండ్ చేశారు. గురువారం ఆలేరులో మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో పీఎం నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని రోడ్డుపై నిరసన తెలిపారు. అనంతరం జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ వనజారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కృష్ణవేణి, దివ్య, పావనిరెడ్డి, నీరజ, అనిత, దీప, విజయజ్యోతి, జాన్సీ, విజయలక్ష్మి, కవిత, సిద్దిలక్ష్మి, నాగజ్యోతి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర
అధ్యక్షురాలు మొగిలి సునీతరావు