
ఆస్తి పన్ను చెల్లింపునకు రాయితీ గడువు పొడిగింపు
భువనగిరిటౌన్ : ముందస్తు ఆస్తి పన్ను చెల్లించేందుకు ప్రభుత్వం అమలు చేసిన ఎర్లీబర్డ్ పథకం గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మున్సిపాలిటీల్లో 5శాతం రాయితీ గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. అయితే ఈ నెల7 వరకూ ఈ గడువును పొడిగిస్తున్నట్లు పురపాలక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. భువనగిరి మున్సిపాలిటీలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను రూ 9.23 కోట్లు డిమాండ్ ఉండగా.. ప్రస్తుతం రూ .1.41 కోట్లు వసూలైంది. మిగతా రూ.7.81 కోట్లు రావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఆలేరు జూనియర్ సివిల్ జడ్జిగా అజయ్‌కుమార్
ఆలేరురూరల్: ఆలేరు జూనియర్ సివిల్ జడ్జిగా అజయ్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన నిర్మల్ జిల్లా కోర్టు నుంచి ఆలేరుకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు బార్ అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఆలేరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మిరియాల వనమరాజు, న్యాయవాదులు జూకంటి రవీందర్, తుంగ హరికృష్ణ, ఎండీ చాంద్‌పాషా, శివకుమార్, రావుల రవీందర్, రవికుమార్, రాజశేఖర్, సిద్దులు తదితరులున్నారు.
స్వర్ణగిరి క్షేత్రంలో
సహస్ర దీపాలంకరణ సేవ
భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు గురువారం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, నిత్య కల్యాణ మహోత్సవం, తిరుప్పావడ సేవ జరిపించారు. సాయంత్రం స్వామి వారికి తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. ఈసందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం సమయంలో సుమారు 3500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు.

ఆస్తి పన్ను చెల్లింపునకు రాయితీ గడువు పొడిగింపు