
భూదాన్ భూములపై విచారణ జరిపించాలి
భూదాన్‌పోచంపల్లి: భూదాన్ భూముల అక్రమాలపై సిట్టింగ్ జిడ్జితో విచారణ జరిపించాలని ఆలిండియా సర్వసేవాసంఘ్ మేనేజింగ్ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి అన్నారు. గురువారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో టూరిజం పార్కు ఆవరణలో ఉన్న ప్రథమ భూదాత వెదిరె అరవిందారెడ్డి, భూదానోద్యమపితామహుడు ఆచార్య వినోబా భావే విగ్రహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆచార్య వినోబాభావే దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేసి పేదలకు లక్షలాది ఎకరాలు పంపిణీ చేశారన్నారు. కానీ నేడు భూదానోద్యమానికి సంబంధం లేని వ్యక్తులు ఈ భూములను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. నాగారంలోని వందలాది భూదాన భూములను ధరణి రికార్డుల్లో పట్టా భూములుగా మార్చుకున్నారన్నారు. భూదాన బోర్డును ప్రక్షాళన చేసి నూతన అధ్యక్షుడిని నియమించాలన్నారు. భూదాన భూముల అక్రమాలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అఖిల భారత సర్వోదయ మండలి జాతీయ అధ్యక్షుడు వెదిరె అరవిందారెడ్డి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తొలుపునురి కృష్ణగౌడ్, ప్రథమ భూదాత కుమారుడు వెదిరె ప్రమోద్ చంద్రారెడ్డి, ప్రఽథమ భూగ్రహీత మనుమడు కరగల్ల శ్రీనివాస్, భూదాన్ రాంచంద్రారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు పోతగల్ల దానయ్య, ఉపాధ్యక్షుడు కొమ్ము లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి కరగల్ల కుమార్, ఎడ్ల లింగస్వామి పాల్గొన్నారు.
ఆలిండియా సర్వసేవాసంఘ్
మేనేజింగ్ ట్రస్టీ మహాదేవ్ విద్రోహి